ఈక్విటీ మార్కెట్లో పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు

by Harish |
sensex up
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితులు మెరుగుపడటం, ఆర్థికవ్యవస్థ తిరిగి సాధారణ స్థాయికి వస్తుందనే సంకేతాల నేపథ్యంలో జూన్ నెలలో విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఈ నెల ఈ 1-11 మధ్య కాలంలో మొత్తం రూ. 13,424 కోట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) ఈక్విటీ మార్కెట్లలోకి వచ్చాయని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. ఇందులో డెట్ మార్కెట్ల నుంచి రూ. 2,096 కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయని గణాంకాలు తెలిపాయి. దీంతో నికరంగా రూ. 25,520 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చాయి.

గడిచిన రెండు వారాలుగా కరోనా కేసులు తగ్గాయి. దీంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ మెరుగుపడిందని, ఆర్థికవ్యవస్థ తిరిగి పుంజుకుంటుందనే ఆశలు పెట్టుబడిదారుల్లో కనిపిస్తోందని’ మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెపారు. మే నెలలో నికర ఎఫ్‌పీఐలు రూ. 2,666 కోట్లు కాగా, అంతకుముందు ఏప్రిల్‌లో రూ. 9,435 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చి చేరాయి. ఈ మొత్తం నిధుల్లో ఎక్కువగా ఐటీ, ఫైనాన్స్, ఎనర్జీ రంగాల్లో చేరినట్టు ఎల్‌కేపీ సెక్యూరిటీస్ విభాగానికి చెందిన ఎస్ రంగనాథన్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed