పంజాగుట్టలో నాలుగేళ్ల చిన్నారి డెడ్ బాడీ కలకలం.. మిస్టరీగా మారిన మర్డర్ ?

by Sumithra |
Panjagutta-Deadbody-1
X

దిశ, ఖైరతాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చే ద్వారకపురి కాలనీలోని ఓ షాపు ముందు చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించేందుకు ప్రయత్నించగా అవి పనిచేయడం లేదని తెలిసింది. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ను రప్పించి వివరాలను సేకరించారు. పోలీస్ శునకాలు మృతదేహం లభ్యమైన చోటినుంచి సమీపంలోని ఓ దుర్వాసన వెదజల్లే ప్రాంతానికి వెళ్లి నిలిచిపోయాయి. క్లూస్ టీం సిబ్బంది చిన్నారి మృతదేహంపై స్వల్ప గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మొదట చనిపోయిన చిన్నారి ఎవరు…? అనంతరం మృతికి గల కారణాలను విశ్లేషించనున్నట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకోడానికి పంజాగుట్ట ప్రధాన రహదారి నుంచి ద్వారకపురి కాలనీ వైపు నుంచి, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి వచ్చే అవకాశం ఉండడంతో ఆయా రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Panjagutta-Deadbody-21

Advertisement

Next Story