కరోనా పేషెంట్లను ఆస్పత్రి చేర్చుకోలేదు!

by vinod kumar |
కరోనా పేషెంట్లను ఆస్పత్రి చేర్చుకోలేదు!
X

న్యూఢిల్లీ: కొవిడ్ 19 పాజిటివ్ పేషెంట్‌ను ఢిల్లీలోని లోక్‌నాయక్ ఆస్పత్రి చేర్చుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్‌టీ పీసీఆర్ ద్వారా టెస్టు చేసుకోగా.. కరోనా పాజిటివ్ వచ్చిందని, చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే చేర్చుకోవడం లేదని చూరివాలాన్ ప్రాంతానికి చెందిన నసీమ్ అన్నారు. తనతోపాటు ముగ్గురు బంధువులు కొన్ని గంటలుగా లైన్‌లో నిలబడి ఉన్నారని చెప్పారు. కరోనా పాజిటివ్‌గా తేలినట్టు ఆస్పత్రి సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక చేసేదేమీ లేక తమ ఆరోగ్య పరిస్థితుల గురించి పోలీసులకు తెలిపామని చెప్పారు. అంతేకాదు, ఇంటి వద్ద మరో ఏడుగురు కరోనా పాజిటివ్ తేలినవారున్నారని వెల్లడించడం గమనార్హం. తాము ఆస్పత్రిలో చేరాకా.. ఇంట్లో ఉన్న పాజిటివ్ పేషెంట్‌లనూ ఫెసిలిటీ సెంటర్‌లో చేర్చవచ్చనే ఉద్దేశంతో ముందుగా నలుగురం వచ్చామని చెప్పారు. ఇదిలా ఉండగా.. లోక్‌నాయక్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జేసీ పాస్సే మాట్లాడుతూ.. కరోనాపాజిటివ్ తేలిన కుటుంబం నుంచి ముగ్గురిని ఆస్పత్రిలో చేర్చుకున్నట్టు వెల్లడించారు.

tags: coronavirus, delhi, positive, denied, admit, family

Advertisement

Next Story