ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కానిస్టేబుల్స్ స్పాట్ డెడ్

by srinivas |   ( Updated:2021-08-23 04:54:34.0  )
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కానిస్టేబుల్స్ స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్ : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ఏఆర్ కానిస్టేబుల్స్ మృతి చెందారు. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై రంగోయి వద్ద ఏఆర్ కానిస్టేబుళ్ల బోలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు ఎస్కార్ట్‌గా వెళ్లివస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు ఏఆర్ కానిస్టేబుల్స్ మృతి చెందారు. మరణించిన వారిలో RSI కృష్ణుడు, ARHC బాబూరావు, ARHC అంథోని , ARPC జనార్ధన్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed