- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్‌కు గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై లేదు.. గవర్నర్‌కు లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: శిథిలావస్థలో ఉన్న పాఠశాలలకు తక్షణమే మరమ్మతులు చేయించాలని, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదుల నిర్మాణం చేపట్టాలని, బడ్జెట్ లో విద్యాశాఖకు నిధులు కేటాయించేలా సీఎస్ కు ఆదేశాలివ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి గవర్నర్ ను కోరారు. గురువారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు లేఖ పంపారు. 2015-16 రాష్ట్ర బడ్జెట్ లో 11 శాతం నిధులు కేటాయించగా, రానురాను తగ్గుతూ వస్తుందని, 2020-21లో 6.8శాతానికి చేరిందన్నారు. దీంతో పాఠశాల విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని, పాఠశాల భవన నిర్మాణాల మరమ్మతుగానీ, కొత్త భవనాల నిర్మాణం గానీ జరగలేదన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేక, శిథిలావస్థలోని తరగతి గదుల మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు కూలుతాయో తెలియక విద్యార్థులు చెట్లకింద కూర్చొని విద్యను అభ్యసిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో సుమారు 4వేల పాఠశాలలు శిథిలావస్థకు చేరాయని, ప్రభుత్వం గుర్తించి సర్వశిక్ష అభియాన్ పథకం కింద తక్షణ మరమ్మతుల కోసం రూ. 109 కోట్లతో కేంద్రానికి రిపోర్టు పంపడం, దానికి కేంద్రం 60శాతం నిధులు మంజూరుకు ఒప్పుకున్నా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తగిన శ్రద్ధ చూపకపోవడంతో కాగితాలకే పరిమితం అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుడులు, గోపురాలకు, సచివాలయ నిర్మానానికి, ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులకు రూ. వేల కోట్లు ఖర్చు చేస్తుంది కానీ, శిథిలావస్థలోని బడుల మరమ్మతులకు మాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. ఇప్పటికే బడ్జెట్ లో విద్యాశాఖకు తగిన నిధులు మంజూరీపై సీఎస్ కు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ ను విజ్ఞప్తి చేశారు.