కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతి

by Anukaran |
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్(82) మృతిచెందారు. గత ఆరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఆర్మీ (రీసెర్చి, రిఫరల్) ఆస్పత్రిలో మృతి చెందారు. ఇటీవల ఆయనకు కోవిడ్-19 పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చిందని ఆర్మీ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో భారత సైన్యంలో మేజర్‌గా పనిచేసిన జశ్వంత్ సింగ్ స్వస్థలం రాజస్థాన్‌లోని బార్మెర్. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా జశ్వంత్ సింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. కాగా 1980 నుంచి వరుసగా 5 సార్లు రాజ్యసభకు, 4 నాలుగు సార్లు లోక్‌సభకు జశ్వంత్ సింగ్ ఎంపీగా ఎన్నిక అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed