- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ నిన్నైనా ఉంచుతాడా.. ? జమునతో ఈటల సంచలన వ్యాఖ్యలు
దిశ,వీణవంక: సీఎం కేసీఆర్ జముననైనా ఉంచుతాడా అంటూ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం వీణవంక మండలం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు పొద్దున్నే లేచి నా భార్య నన్ను ఒక మాట అడిగింది. నీ చుట్టూ తిరిగేవాళ్లను లేకుండా చేశారు. నీ డ్రైవర్‌ని కూడా ఉంచరంటా.. అని అడిగింది. అది సరే నిన్నైనా ఉంచుతారా లేదా? అని నేను అడిగా. నవ్వి ఊరుకుంది. ఇక్కడ అడ్డా పెట్టిన మంత్రి హుకుం జారీ చేస్తున్నాడు.
ఎందుకు ఇంక రాజేందర్ వెంబడి తిరిగేవాళ్ళు ఉంటున్నారు. అందరినీ తీసుకరాండని. ఆత్మగౌరవానికి వెల కట్టి కొనుగోలు చేయాలని చూస్తున్నారు. వాళ్ళు కొన్నట్టు భావిస్తున్నారు. మనోళ్లు అమ్ముడు పోయినట్టు నటిస్తున్నారు. ఈ పోరాటం నా ఒక్కడిదే కాదు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటం. కేసీఆర్ పథకాల పేరుతో మీకు ఒక చెక్కుతో పాటు కత్తి కూడా ఇస్తున్నాడు. ఆ కత్తితో రాజేందరును పొడవమని చెబుతున్నాడు. నేను పోటీ పడింది సీఎం కుర్చీ కోసం కాదు. నిరుద్యోగ బిడ్దల కోసమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ తిప్పని సమ్మయ్య, పలువురు గ్రామ ప్రజలు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.