- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం కేసీఆర్‌పై వివేక్ వెంకటస్వామి విమర్శలు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంటకస్వామి విమర్శలు గుప్పించారు. కరోనా కష్టాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చొని చోద్యం చూస్తున్నవారని ధ్వజమెత్తారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన సమయంలో సచివాలయాన్ని కూల్చుతున్నారని మండిపడ్డారు. అసలు ఆయన ప్రతిపక్షాలను గుర్తించరని.. కానీ ప్రధాని మోదీ విపక్షాలందరి సలహాలు, సూచనలు తీసుకొని కీలక నిర్ణయాలు తీసుకున్నారని వివేక్ అన్నారు. కేసీఆర్ పాలన నిజాం సర్కారును తలపిస్తోందని ఆయన మండిపడ్డారు.
”ప్రతిపక్షాలు సూచనలిస్తే బాగుటుందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రతిపక్షాలను ఇప్పటి వరకు గుర్తించలేదు. ప్రధాని మోదీ మాత్రం విపక్ష నేతలందరితోనూ మాట్లాడారు. కరోనా విషయంలో అందరి సూచనలను స్వీకరించి నిర్ణయం తీసుకున్నారు. కానీ తెలంగాణలో సీఎం కేసీఆర్ నిజాం సర్కార్ తరహాలో విపక్షాలను అరెస్ట్ చేయిస్తున్నారు. బీజేపీ ఎంపీపై దాడి చేయించారు. కరోనా విషయంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో కూర్చొని ప్రాజెక్టులు రీడిజైన్లు, కమిషన్‌ల గురించి ఆలోచిస్తున్నారు. ప్రజలకు ఎలా మంచి చేయాలనే ఆలోచన వారికి లేదు.” అని వివేక్ విమర్శించారు.