- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి మాజీ ఎంపీ, విశాఖపట్నం మాజీ మేయర్ సబ్బం హరి కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. కాగా, ఇటీవలే సబ్బం హరి ఆరోగ్య పరిస్థితిపై తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరా తీశారు. అమెరికాలోని ప్రముఖ వైద్యులతో సంప్రదింపులు జరిపారు. ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించినా ఫలితం లేకుండా పోయింది.
కాగా, 1952 జూన్ 1వ తేదీన జన్మించిన సబ్బం హరికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. 1995 విశాఖపట్నం మేయర్‌గా పనిచేసిన, ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో సబ్బం హరి ఒకరు. వైఎస్ జగన్ కాంగ్రెస్‌ను ఎదిరించి వైసీపీ పార్టీ పెట్టిన సందర్భంలో జగన్‌కు తోడుగా ఉండటమే కాకుండా.. ఓదార్పు యాత్రలో ఆయనతో పాల్గొన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్‌కు సబ్బం హరి దూరం అయ్యారు. 2019 ఎన్నికల్లో చివరి నిముషంలో టీడీపీలో చేరి భీమిలీ నియోజకవర్గం పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.