- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలోకి రమేష్ రాథోడ్.. సస్పెన్స్ వీడేనా..?
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నాయకులు, మంచి పట్టున్న నేతగా పేరొందిన రాథోడ్ రమేశ్ పార్టీ మార్పుపై చిక్కుముడి నెలకొంది. ఇప్పటికే ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా.. ఇప్పట్లో ముహూర్తం కుదిరేలా కనిపించడం లేదు. కాషాయ కండువా కప్పుకునేందుకు ప్రస్తుత ఎంపీ సోయం బాపురావు ప్రధానంగా అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులపై టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై స్పందించిన రాథోడ్.. అసలు తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే తీసుకోలేదని.. కాంగ్రెస్ సభ్యుడిని కాదని.. అలాంటప్పుడు సస్పెండ్ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. అయితే, బీజేపీలో చేరేందుకు ఇప్పటికే చర్చలు జరిపారు. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు రాథోడ్ రమేశ్ రావడం ఇష్టం లేదనే చర్చ సాగుతోంది. రెడ్డి ఖానాపూర్ ఆసిఫాబాద్ నియోజకవర్గాలతో పాటు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో రాథోడ్‌కు మంచి పట్టుంది. ఒక బలమైన నాయకుడిగా పేరున్న ఆయన బీజేపీలో చేరేందుకు ఇప్పటికే తన సన్నిహితులతో చర్చించారు.
రాష్ట్ర, జాతీయ నాయకులతో కూడా చర్చలు జరిపారు. ఆయన చేరికపై నాయకత్వం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో రమేష్ చేరడం ఖాయమని అనుకున్న సమయంలో.. ప్రస్తుత ఎంపీ సోయం బాపురావు అభ్యంతరం వ్యక్తం చేశారని పార్టీలో చర్చ సాగుతోంది. ఈ కారణంగానే ఆయన చేరికలో కొంత జాప్యం జరిగింది. ఇటీవలే రాథోడ్ సిట్టింగ్ ఎంపీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. చేరికపై ఎంపీ సోయం బాపురావుతో చర్చించినప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో సానుకూలంగా లేరని చర్చ సాగుతోంది. ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే భావన వ్యక్తం అవుతున్నప్పటికీ.. కొంతకాలం తర్వాత చేరుతారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు త్వరలో పెద్ద మొత్తంలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా.. వారితో పాటు ఈయన కూడా చేరుతారనే చర్చ నడుస్తోంది. రాథోడ్ర మేశ్‌ను పార్టీలో చేర్చుకునే విషయంలో సోయం బాపురావుతో రాష్ట్ర, కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఈ విషయమై చర్చిస్తోంది.
మరోవైపు రాథోడ్ రమేష్ కూడా సోయం బాపురావును ప్రత్యేకంగా కలిసి చర్చించారు. సోయం బాపురావు సమ్మతి మేరకే రాథోడ్ చేరుతారనే చర్చ పార్టీలో ఉంది. ఒకవేళ చేరితో రాథోడ్ రమేష్ ఖానాపూర్ నుంచి పోటీ చేస్తారా.. ఆదిలాబాద్ పార్లమెంట్‌కు పోటీ చేస్తారా.. అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకా.. పార్లమెంటుకా.. అనే విషయంపై స్పష్టత వచ్చాకే.. పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలిసింది. రాథోడ్ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు కావడంతో ఆయన్ను పార్టీలో చేసుకోవడమే మంచిదని కమలం శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. చివరగా ఎంపీ సమ్మతి మేరకే ఆయన చేరిక ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు రాథోడ్ బీజేపీలో చేరకపోయినా.. కొంతకాలం తర్వాత చేరే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.