రైతులకు సంఘీభావంగా యెండల ఉపవాస దీక్ష

by Shyam |
రైతులకు సంఘీభావంగా యెండల ఉపవాస దీక్ష
X

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ సమయంలో అన్నదాతలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులకు సంఘీభావంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఉపవాస దీక్ష చేపట్టారు. శుక్రవారం నగరంలోని తన నివాసంలోనే ఒక్కరోజు ఉపవాస దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. రాష్ర్టంలో యాసంగి పంటలు చేతికి వచ్చిన తరువాత దిగుబడి వచ్చిన రైతులకు కష్టాలు తప్పడం లేదన్నారు. కోనుగోలు దారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్న పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్సయ్య కూడా తన నివాసంలో ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టారు.

Tags : Former MLA, yendala laxminarayana, fasting, protect, farmers, nizamabad

Next Story