- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు :సంపత్ కుమార్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏపీ దుర్భుద్ది వల్ల దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం జరగుతోందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆర్డీఎస్ కింద అలంపూర్ నియోజకవర్గం అంధకారంగా మారనుందని అన్నారు. ఆర్డీఎస్ ద్వారా 15 టీఎంసీల కేటాయింపులు ఉన్నా.. రావడం లేదని తెలిపారు. ఆర్డీఎస్‌కు సమాంతరంగా ఇంకో కాలువ తీసి ఏపీ దౌర్జన్యంగా నీళ్లు తరలిస్తోందని విమర్శించారు.
తనకు రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని సంపత్ కుమార్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని కలిసేందుకు నేరుగా తన ఇంటికే వెళ్తున్నానని తెలిపారు. ఏపీ 160 కిలోమీటర్ల కెనాల్ తవ్వుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని సంపత్ కుమార్ ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏపీ ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.