కారెక్కిన మోత్కుపల్లి.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

by Anukaran |   ( Updated:2021-10-18 04:53:19.0  )
Motkupalli Narasimhulu, Chief Minister KCR
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మోత్కుపల్లికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. మోత్కుపల్లికి అపారమైన రాజకీయ అనుభవం ఉందని వెల్లడించారు. అంతేగాకుండా.. మోత్కుపల్లి నర్సింహులు తనకు అత్యంత సన్నిహితుడు అని అన్నారు. తనతో కలిసి ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేశాడు. టీడీపీ హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు మోత్కుపల్లి అని అన్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణలో కరెంటు కోతలు ఎలా ఉండేవో అయనకు బాగా తెలుసు, మంచినీళ్లు కూడా కొనుక్కొని తాగాల్సిన దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. కానీ, నేడు తెలంగాణకు నీటి బాధ లేదని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed