వసుంధరా రాజే బ్యాక్ టు కౌంటర్..

by Shamantha N |
వసుంధరా రాజే బ్యాక్ టు కౌంటర్..
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై గత కొన్ని రోజులుగా సైలంట్‌గా ఉన్న మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా ఎట్టేకేలకు మౌనం వీడారు. రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయం పై స్పందించారు. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలకు ప్రజలు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇది దురదృష్టకరం’’ అంటూ ట్వీట్ చేశారు.

కరోనా కారణంగా 500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తమకేమీ పట్టనట్లుగా.. అంతర్గత కుమ్ములాటలతో పాలనను గాలికొదిలేసిందని విమర్శించారు. రాష్ట్రంలో 28,000 పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయన్నారు. అంతేకాకుండా మిడతలు దాడి , మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న సమయంలో ఈ సంక్షోభం పరిణామాలు ఏంటనీ ప్రశ్నించారు. ఇది ప్రజల గురించి ఆలోచించాల్సిన సమయమని, ఈ బురదలోకి బీజేపీని, తమ పార్టీ నాయకులను లాగడంలో అర్థం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed