‘పద్మ విభూషణ్’ వెనక్కిచ్చిన ప్రకాశ్ బాదల్

by Shamantha N |   ( Updated:2020-12-03 10:49:05.0  )
‘పద్మ విభూషణ్’ వెనక్కిచ్చిన ప్రకాశ్ బాదల్
X

దిశ, వెబ్‌డెస్క్ : రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పౌర పురస్కారం వెనక్కి ఇచ్చిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచిపోనున్నారు. దేశంలో రెండో అత్యున్నతమైన పురస్కారమైన పద్మవిభూషణ్‌ను 2015లో ప్రకాశ్ సింగ్ బాదల్‌ అందుకున్నారు.

రైతులపై క్రూర అణచివేత చర్యలను నిరసిస్తూ పద్మ విభూషణ్ పురస్కారం వెనక్కి ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి నా నిరసన తెలుపాలనుకున్నాను. ప్రజల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ముఖ్యంగా సాధారణ రైతులు ఇందుకు ప్రధాన కారణం. ఈ రోజు నా గౌరవం కంటే విలువైనది కోల్పోయాను. ఇకపై పద్మవిభూషణ్ పురస్కారం నా వద్ద ఉంచుకోవాల్సిన అవసరం లేదని బాదల్ వెల్లడించారు. కాగా, నూతన వ్యవసాయ చట్టాల బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వెంటనే ఎన్‌డీఏ నుంచి శిరోమణి అకాలీదల్ వైదొలిగిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story