ఖానాపూర్‎లో ఫారెస్ట్ ఆఫీసుపై దాడి..!

దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజ్ కార్యాలయంపై దాడి జరిగింది. వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టకిషన్ అనే వ్యక్తి కుటుంబసభ్యులు ఆఫీసుపై దాడి చేశారు. గత రెండు రోజుల క్రితం పుట్టకిషన్ చిరుత పులిని వేటాడేందుకు వెళ్లినట్లు అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో తీసుకెళ్లి కొట్టడంతో కిషన్ స్పృహ కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కిషన్ కుటుంబసభ్యులు ఫారెస్ట్ ఆఫీసుపై దాడి చేశారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న కిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement