చరిత్రలో తొలిసారి.. 31 వరకు దేశ వ్యాప్తంగా రైళ్లు బంద్

by Shamantha N |
చరిత్రలో తొలిసారి.. 31 వరకు దేశ వ్యాప్తంగా రైళ్లు బంద్
X

దేశ చరిత్రలో తొలిసోరి ఇండియన్ రైల్వే మూగబోనుంది. లక్షలాది మందిని నిత్యం గమ్యస్థానానికి చేరవేసే రైళ్లకు కరోనా సెగ తగిలింది. దీంతో దేశవ్యాప్తంగా రైళ్లు పది రోజులపాటు నిలిపోనున్నాయి. కరోనా వ్యాప్తి ఆందోళన నేపథ్యంలో రైల్వే సర్వీసులను నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నేటి నుంచి ఈ నెల 31 వరకు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి కార్గోకి మినహాయింపునిచ్చినట్టు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి పెరిగితే వాటిని కూడా నిలిపేసే అవకాశం ఉంది. దీంతో పది రోజుల పాటు దేశంలో రైళ్లన్నీ నిలిచిపోనున్నాయి.

Tags: indian railways, trains stop, stopped trains

Advertisement

Next Story

Most Viewed