- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సేఫ్టీ పేరుతో వాష్‌రూమ్ డోర్లు తొలగించిన స్కూల్ యాజమాన్యం.. ఎందుకు?
దిశ, ఫీచర్స్ : ఇల్లు, ఆఫీస్ అనే తేడా లేకుండా ఎక్కడైనా సరే వాష్‌రూమ్స్‌కు పకడ్బందీగా డోర్లు అమరుస్తాం. ప్రైవసీ, సేఫ్టీకి భంగం కలగకుండా ఉండేందుకు అలా చేస్తాం. కానీ అమెరికాలోని ఓ పాఠశాలలో మాత్రం భద్రతా కారణాల పేరుతోనే వాష్‌రూమ్ డోర్లు తొలగించారు. దీంతో ప్రైవసీ సమస్యలు తలెత్తున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
టెక్సాస్, ఆస్టిన్‌లోని ఓ హై స్కూల్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ వినియోగంతో పాటు ఈ సంవత్సరం సంభవించిన ఇతర ‘సిగ్నిఫికెంట్ బిహేవియరల్ ఈవెంట్స్’ తనిఖీ చేసేందుకు వీలుగా రెస్ట్‌రూమ్ తలుపులను తొలగించాలని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన నిర్ణయాన్ని వివరిస్తూ ప్రిన్సిపాల్ క్రిస్టినా స్టీల్ హాంట్‌గిన్ విద్యార్థుల తల్లిదండ్రులకు లెటర్ రాసింది. రెస్ట్‌రూమ్స్‌లో ‘ప్రవర్తనాపరమైన సంఘటనలు, ఉల్లంఘనలు’ ఉన్నాయని, వీటిలో 90% వరకు మాదకద్రవ్యాల నేరాలు ఉన్నాయని సదరు లేఖలో వెల్లడించింది. అంతేకాదు డోర్స్ తొలగించినప్పటి నుంచి ఎటువంటి సంఘటనలు జరగలేదని ఆమె పేర్కొంది. అయితే వాష్‌రూమ్‌లోని ఏ స్టాల్‌ను కూడా బయట హాల్ నుంచి చూడలేమని మరో నివేదిక స్పష్టం చేసింది.
ఇక ఈ పరిణామంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్న పలువురు నెటిజన్లు ప్రైవసీ సమస్యల్ని లేవనెత్తుతున్నారు. కాగా భద్రతకే ప్రాధాన్యతనిస్తామన్న స్కూల్ ప్రిన్సిపాల్.. మా క్యాంపస్‌లో సురక్షిత అభ్యాస వాతావరణాన్ని కల్పించేందుకు రూపొందించిన ప్రణాళికలు లేదా అమలుచేస్తున్న అనేక వ్యూహాల్లో తలుపులు తీసివేయడం ఒకటని ఆమె తన లేఖలో వివరించారు.
- Tags
- High school