అవకాశం ఇవ్వండి.. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తా : చిట్టిమల్లు

by Sridhar Babu |
Folk artist Chittimallu
X

దిశ, ఖమ్మం రూరల్: టాలెంట్ ఉన్న కళాకారులకు సినిమాల్లో హీరోగా అవకాశాలు ఇవ్వాలని ఖమ్మం సినీ కళాకారుడు ఎదురుగట్ల చిట్టిమల్లు అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో చిట్టిమల్లు మీడియాతో మాట్లాడుతూ… ‘‘మా’’ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణా సినీ పరిశ్రమలో ఆధిపత్య పోరు కొనసాగుతూ పేద, ప్రతిభ గల కళాకారులను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ కళాకారుల కనుసన్నలలోనే సినీ పరిశ్రమ కొనసాగుతోందని తద్వారా ఎంతోమంది కళాకారులు వీధిన పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా.. కళాకారుల విన్నపాలను అర్థం చేసుకొని కొత్త కళాకారులకు కూడా అవకాశం కల్పించాలని కోరారు.

ఖమ్మంలో 150 మంది కళాకారులున్నారని ఆయన తెలిపారు. అసలైన కళాకారులకు సినీ రంగంలో ఎటువంటి అవకాశాలు ఇవ్వడం లేదని, తెలంగాణా సిద్ధించిన తర్వాతనైనా ఇక్కడి కళాకారులకు అవకాశాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో జరుగనున్న “మా” ఎన్నికల్లో తనకు కూడా అవకాశం ఇవ్వాలని, కళాకారులను అన్ని విధాలా ఆదుకునేలా సహకరించాలని తెలంగాణ రాష్ట్ర జానపదకళాకారుల సంఘం సభ్యులు ఎదురుగట్ల చిట్టిమల్లు కోరారు. ఈ సమావేశంలో మోటం రాములు, కళ్ళెం భాస్కర్రావు, చల్లా సంగయ్య, శ్రావణ్, మహేష్, మారయ్య, వరకుమార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed