- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎక్సైజ్ సుంకాల ద్వారా రూ. 8.02 లక్షల కోట్ల ఆదాయం
దిశ, వెబ్‌డెస్క్: గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో పెట్రోల్, డీజిల్‌లపై పన్నుల ద్వారా కేంద్రం దాదాపు రూ. 8.02 లక్షల కోట్లను ఆర్జించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేవలం 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఎక్సైజ్ సుంకాల ద్వారా ప్రభుత్వానికి రూ. 3.71 లక్షల కోట్లకు పైగా వసూలైనట్టు పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించారు. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం 2018, అక్టోబర్ 5 నాటికి లీటర్‌కు రూ. 19.48 ఉండగా, 2021, నవంబర్ 4 నాటికి అది రూ. 27.90కి పెరిగింది. అలాగే, డీజిల్‌పై సుంకం రూ. 15.33 నుంచి రూ. 21.80కి పెరిగిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పెట్రోల్‌పై ఎకైజ్ సుంకం రూ. 32.98, డీజిల్‌పై రూ. 31.83 వరకు పెరిగిందని, ఆ తర్వాత కేంద్రం దీపావళి పండుగకు ముందు నవంబర్ 4న పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత మూడేళ్ల కాలంలో పెట్రోల్, డీజిల్ నుంచి వసూలు చేసిన సెస్, సెంట్రల్ ఎక్సైజ్ సుంకాల ద్వారా ప్రభుత్వానికి.. 2018-19లో రూ. 2,10,282 కోట్లు, 2019-20లో రూ. 2,19,750 కోట్లు, 2020-21లో రూ. 3,71,908 కోట్లు వచ్చాయని ఆర్థిక మంత్రి వివరించారు.