- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలిసారి రైలు ద్వారా ఫ్లైయాష్ రవాణా
దిశ, న్యూస్‌బ్యూరో: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి తొలిసారిగా రైల్వే ట్యాంకర్ల ద్వారా ఫ్లై యాష్ రవాణా ప్రారంభించినట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు సంస్థ అధికారులు సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ప్రతిరోజు 150 నుంచి 200 లారీల ద్వారా ఫ్లైయాష్ వివిధ సిమెంటు, ఇటుకల కర్మాగారాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. అయితే సంస్థ చైర్మన్ ఎన్. శ్రీధర్ ఆదేశాల మేరకు పర్యావరణ హితంగా ఎక్కువ ఫ్లైయాష్‌ను రవాణా చేయాలన్న లక్ష్యంతో మంచిర్యాలలోని ఎస్టీపీపీ నుంచి తమిళనాడులోని ఏసీసీ సిమెంటు కర్మాగారానికి ఫ్లైయాష్ రవాణాకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా 60ట్యాంకర్లను సోమవారం తొలిసారిగా లోడింగ్ చేసి రవాణా చేసినట్లు చెప్పారు. ఉత్పత్తి అయిన ఫ్లైయాష్‌ను నూరు శాతం రవాణా చేయగా మిగిలిన ఫ్లైయాష్ ను ప్రస్తుతానికి రోడ్డు మార్గం ద్వారా ఓరియెంట్ సిమెంట్స్, కేశోరాం సిమెంట్స్‌కు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
సింగరేణి ఆస్పత్రులకు కరోనా మందులు సిద్ధం
సింగరేణి ఆస్పత్రులకు సుమారు రూ.8కోట్ల కరోనా మందులు, కిట్లు, పరికరాలు సిద్ధం చేసినట్లు సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. కొవిడ్‌పై సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగరేని ప్రాంతాల్లోని అన్ని కొవిడ్ సీరియస్ కేసులను హైదరాబాద్‌కు తరలించాలని, ఏరియా ఆస్పత్రుల్లో 21మంది డాక్టర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని ఆయన ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సంస్థ డైరెక్టర్లు, మెడికల్ అధికారులు పాల్గొన్నారు.