టాయ్‌లెట్ పేపర్‌కి బదులు ఇది వాడారు… ఇబ్బందులు పడ్డారు

by Shyam |
టాయ్‌లెట్ పేపర్‌కి బదులు ఇది వాడారు… ఇబ్బందులు పడ్డారు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ పాండమిక్ కారణంగా పాశ్చాత్య దేశాల్లో టాయ్‌లెట్ పేపర్ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ భయంతో సూపర్ మార్కెట్లకు వెళ్లి పెద్దఎత్తున టాయ్‌లెట్ పేపర్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నారు. దీంతో చాలా మాల్స్ నో స్టాక్ బోర్డు పెట్టేశాయి. ఇక చాలా మందికి టాయ్‌లెట్ పేపర్ కరువువడంతో కొత్త సమస్యలు తలెత్తాయి. లండన్ లాంటి చెంబులు లేని దేశంలో ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది.

టాయ్‌లెట్ పేపర్ దొరకని వారు దానికి ప్రత్యామ్నాయంగా న్యూస్ పేపర్, వస్త్రాలు, ఇతర మెత్తటి వస్తువులు ఉపయోగిస్తున్నారు. వీటిని ఉపయోగించిన తర్వాత టాయ్‌లెట్ పేపర్ పడేసినట్లుగా లెట్రిన్ కమోడ్‌లో పడేస్తున్నారు. దీంతో అవి పైపుల్లో ఇరుక్కుని ప్లంబింగ్ సమస్యలకు దారితీస్తున్నాయి. ఈ విషయమై లండన్‌లోని నార్తుంబ్రియన్ వాటర్ కంపెనీ ప్రజలను హెచ్చరించింది.

టాయ్‌లెట్ పేపర్‌కి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్న వాటికి నీళ్లలో కరిగే గుణం లేని కారణంగా అవి పైపులకు అడ్డుపడుతున్నాయని, ఉపయోగించిన వాటిని డస్ట్ బిన్‌లలో వేసుకోవాలని లేకపోతే టాయ్‌లెట్ ఫ్లష్ సమస్యలు వచ్చి ఇళ్లంతా మురుగుగా మారుతుందని హెచ్చరించింది. ఇలాంటి సెల్ఫ్ ఐసోలేషన్ పరిస్థితుల్లో ఇళ్లు మురుగుగా మారితే లేనిపోని సమస్యలు వస్తాయని వాటర్ కంపెనీ హెడ్ సైమన్ సిహాంకో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed