చిత్తూరులో వరద బీభత్సం.. కుప్పకూలిన భవనం.. వీడియో వైరల్

by srinivas |   ( Updated:2023-05-01 05:33:46.0  )
చిత్తూరులో వరద బీభత్సం.. కుప్పకూలిన భవనం.. వీడియో వైరల్
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగుపొర్లుతున్నాయి. ముఖ్యంగా తిరుచానూర్‌లో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వసంతనగర్‌‌ను స్వర్ణముఖి నది చుట్టేసింది. దీంతో తిరుచానూరులోని రెండంతస్థుల భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. అంతేకాదు నదిలో కొట్టుకుపోయింది. భవనం కూలిపోయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు తిరుపతి నగరం మొత్తం వరద నీటితో నిండిపోయింది.

ఎటు నుంచి ఏ వాగు పొంగుతుందో.. ఏ నది గ్రామాలను చుట్టుముట్టేస్తుందోనన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు. కొన్ని గ్రామాలు పూర్తిగా జలమయం అవ్వడంతో తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రమాదకరమైన భవనాలను గుర్తించి అధికారులు వాటిని ఖాళీ చేయిస్తున్నారు. అందులో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed