- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ సహా పలు నగరాల్లో మౌలికసదుపాయాలు పెంచనున్న ఫ్లిప్‌కార్ట్!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రధాన నగరాల్లో కిరాణా సరుకుల డెలివరీల కోసం ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల సామర్థ్యాన్ని 8 లక్షల చదరపు అడుగులకు విస్తరించాలని భావిస్తున్నట్టు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. రాబోయే మూడు నెలల్లో ఈ అడిషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల విస్తరణతో ఫ్లిప్‌కార్ట్ రోజుకు 73 వేల కిరాణా ఆర్డర్లను పరిష్కరించగలదని కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అదనపు మౌలిక సదుపాయాల ద్వారా దేశవ్యాప్తంగా కిరాణా మార్కెట్లో ఎక్కువమంది వినియోగదారులకు ఆన్‌లైన్ షాపింగ్ సౌలభ్యాన్ని కల్పించవచ్చని ఫ్లిప్‌కార్ట్ అభిప్రాయపడింది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సంస్థ కిరాణాలో 200 కంటే ఎక్కువ విభాగాల్లో 7 వేల ఉత్పత్తులను అందిస్తోంది. వీటిలో రోజువారీ సామగ్రి, బేవరేజెస్ వంటి వస్తువులున్నాయి. తాజా విస్తరణ బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సహా ఇతర నగరాల్లో ఉంటాయని కంపెనీ తెలిపింది. కొత్త అడిషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో సాంప్రదాయ గిడ్డంగుల మాదిరిగా కాకుండా, ఆర్డర్లు సురక్షితంగా, సమయానికి ప్రాసెస్ చేయడానికి వీలుగా ఆటోమేటెడ్ పిక్, ప్యాక్, షిప్పింగ్ విధానంలో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వివరించింది.