- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లిప్‌కార్ట్ అమ్మకందారుల సంఖ్యలో 35 శాతం వృద్ధి!
దిశ, వెబ్‌డెస్క్: గతేడాదితో పోలిస్తే 2020లో తమ ప్లాట్‌ఫామ్‌పై అమ్మకందారుల సంఖ్య 35 శాతం పెరిగిందని వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ శుక్రవారం తెలిపింది. ప్రధానంగా టైర్2 ప్రాంతాల నుంచి అమ్మకందారులతో పాటు కస్టమర్లు కూడా పెరిగారని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ ఏడాది కరోనా ప్రభావం నేపథ్యంలో సామాజిక దూరం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ఏడాది ఎక్కువమంది కస్టమర్లు ఈ-కామర్స్ వినియోగానికి మొగ్గు చూపారు.
ముఖ్యంగా మెట్రోలతో పాటు టైర్3 ప్రాంతాల్లో ఫ్లిప్‌కార్ట్ వినియోగం పెరిగిందని కంపెనీ తెలిపింది. ఈ-కామర్స్ రంగంలో భాగస్వామ్యాలు పెరిగాయని వెల్లడించింది. సాంకేతికత పురోగతి, కొత్త సాధనాల వినియోగం పెరిగిందని చెప్పింది. రోజూవారి అవసరాలు, వినియోగదారుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో వినియోగదారుల వృద్ధి 50 శాతానికి దగ్గరగా ఉందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.