- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘కరోనాపై పోరుకు 5 ఆయుధాలు’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఐదు ఆయుధాలను ఢిల్లీ వినియోగిస్తున్నదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దేశంలోనే అత్యధికంగా రోజుకు సుమారు 20వేల టెస్టులు నిర్వహిస్తున్న ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తేస్తున్న దశల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అంగీకరించింది. కేసులకు అడ్డుకట్ట వేయడానికి ఒకటి లాక్‌డౌన్ పొడిగించాలి లేదా దానితో పోరాడాలి. ఈ రెండు ఆప్షన్‌లలో కరోనాపై పోరాడటానికే నిర్ణయించామని సీఎం అన్నారు.
ఇందుకోసం ఐదు ఆయుధాలతో కరోనాపై పోరాటాన్ని సాగిస్తున్నామని తెలిపారు. మొదటిది కరోనా పేషెంట్లకు సరిపడా బెడ్‌లను ఏర్పాటు చేయడం, ఇప్పుడు అన్ని హాస్పిటళ్లలో 40శాతం పడకలు కొవిడ్ 19 పేషెంట్లకే కేటాయించామని వివరించారు. ప్రస్తుతం ఢిల్లీలో 13,500 పకడలున్నాయి. టెస్టింగ్ ల్యాబ్‌లను పెంచడంపైనా దృష్టి పెట్టినట్టు తెలిపారు. మిగతావి ప్లాస్మా థెరపీ, భారీగా చేపడుతున్న స్క్రీనింగ్ టెస్టులు, పేషెంట్లను గుర్తించగా వెంటనే ఐసొలేషన్‌కు పంపడం అనే ఆయుధాలతో ఢిల్లీ తలపడుతున్నదని చెప్పారు. ఈ ఆయుధాల ద్వారా ఢిల్లీ తప్పకుండా కరోనాపై విజయం సాధిస్తుందని అన్నారు.