బాలికపై ఐదుగురు యువకులు.. నగ్నంగా వీడియోలు తీసి..

by Sumithra |   ( Updated:2021-07-30 03:45:05.0  )
girl rape
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో రోజురోజుకు మహిళలు, బాలికలపై లైంగిక దాడులు పెరుగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు, జీవోలు తీసుకువచ్చినా దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై 6నెలల పాటు ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమె నగ్నంగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. చివరకు ధైర్యం చేసుకొని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు యువకులను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్‌కు చెందిన ఓ మైనర్‌పై ఆమె స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అత్యాచారం ఘటనను వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను అతడి స్నేహితులకు పంపించాడు. ఈ క్రమంలో వారు సదరు బాలికను వీడియో వైరల్ చేస్తామని భయపెట్టి ఐదుగురు యువకులు 6 నెలల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఈ విషయం బయటకు చెబితే అత్యాచారం చేసిన వీడియోలను బయట పెడతామని హెచ్చరించారు. ఈ బాధలను భరించలేక జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులు ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed