ఏపీలో ఘోరం.. ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి

by Anukaran |
Five patients died
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని సామాన్య జనాలు ప్రాణభయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా.. ఏపీలోని విజయనగరం జిల్లా ఆస్పత్రిలో తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా పేషెంట్లు మృతిచెందారు. అంతేగాకుండా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని స్థానిక వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికీ పునరుద్ధరణ కానీ ఆక్సిజన్ సరఫరా కాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆక్సిజన్ సిలిండర్ల కోసం రోగుల బంధువులు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి ప్రాంగణంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు తీవ్రభయాందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed