- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనలే లక్ష్యంగా..
దిశ, స్పోర్ట్స్ : ఒకవైపు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలిచి దూకుడు మీదున్న టీమ్ ఇండియా, మరోవైపు స్వదేశం, విదేశాల్లో టెస్టు సిరీస్‌లు గెల్చిన ఉత్సాహంతో ఇంగ్లాండ్ జట్టు. ఈ రెండు టీమ్స్ శుక్రవారం నుంచి చెన్నైలో తొలి టెస్టు మ్యాచ్ ఆడనున్నాయి. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో అడుగు పెట్టడానికి ఇండియా, ఇంగ్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా తలరాతను కూడా ఆ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ రాయనున్నది. స్వదేశంలో ఆడుతున్నామనే ధీమాతో టీమ్ ఇండియా బరిలోకి దిగనుండగా.. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో మంచి రికార్డు ఉన్న ఇంగ్లాండ్ జట్టు కూడా ఆత్మవిశ్వాసంతో ఆడటానికి సిద్దమైంది. ఆంతోని డి మెల్లో ట్రోఫీ ప్రస్తుతం టీమ్ ఇండియా చేతిలోనే ఉన్నది. ఈ ట్రోఫీని గెలుచుకోవడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో చోటు సంపాదించడమే లక్ష్యంగా టీమ్ ఇండియా బరిలోకి దిగుతున్నది.
దుర్భేద్యమైన బ్యాటింగ్..
కొన్ని రోజుల క్రితం ఇంగ్లాండ్‌లోని ఒక కౌంటీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. త్వరలో ఇంగ్లాండ్ రాబోతున్న కోహ్లీ సేనకు స్వాగతం అనే బ్యానర్ కట్టారు. అంటే జూన్ నెలలో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా ఆడుతుందని అక్కడి అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. అంటే టీమ్ ఇండియా మీద మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. అలా ఉండటానికి ఒకే ఒక కారణం భారత జట్ట బ్యాటింగ్ లైనప్. ఆస్ట్రేలియాలో రెగ్యులర్ టెస్టు ప్లేయర్లు లేకుండానే అద్భుత విజయాలు సాధించింది.
కానీ చెన్నై టెస్టుకు సీనియర్లు అందరూ అందుబాటులోకి వచ్చారు. ఓపెనర్‌గా రోహిత్ శర్మకు తోడుగా కేఎల్ రాహుల్ లేదా శుభమన్ గిల్ వచ్చే అవకాశం ఉన్నది. గిల్ గబ్బాలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత వరుసగా చతేశ్వర్ పుజార, అజింక్య రహానే ఉన్నారు. వీరందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. స్వదేశంలో వీరందరికీ మంచి రికార్డు ఉన్నది. ఇక గబ్బా టెస్టు హీరో రిషబ్ పంత్ కూడా తుది జట్టులో ఉంటాడని కోహ్లీ హింట్ ఇచ్చాడు. దీంతో భారత జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనపడుతున్నది. పంత్ తర్వాత వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న వాళ్లే కాబట్టి ఈ విషయంలో ఇంగ్లాండ్‌తో సరిసమానంగా భారత జట్టు ఉన్నది.
ఇషాంత్ చేరికతో..
ఇంగ్లాండ్, ఇండియా జట్లలో అతిపెద్ద తేడా బౌలింగ్ విభాగంలోనే కనపడుతున్నది. ఇషాంత్ శర్మ రాకతో మన పేస్ దళం బలం పెరిగింది. బుమ్రా, ఇషాంత్ జోడి గతంలో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన వాళ్లే. ఇంగ్లాండ్ జట్టులో అండర్సన్, బ్రాడ్‌లకు ధీటుగా వీళ్లు బంతులు విసరగలరు. అయితే స్పిన్నర్ల విభాగంలో మాత్రం ఇండియాదే పైచేయి. రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఎంత మంది స్పిన్నర్లు బరిలోకి దిగుతారనే విషయంపై స్పష్టత లేదు. మూడో పేసర్‌గా మహ్మద్ సిరాజ్ బరిలో ఉంటే కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కక పోవచ్చు. అయితే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని అనుకుంటే మాత్రం సిరాజ్‌ను పక్కన పెట్టి కుల్దీప్‌కు అవకాశం ఇస్తారు. ఎలా చూసుకున్నా.. ఇంగ్లాండ్ స్పిన్నర్ల కంటే టీమ్ ఇండియా స్పిన్నర్లదే పై చేయిగా కనిపిస్తున్నది. మొయిన్ అలీ గత కొంత కాలంగా ఫామ్‌లో లేకపోవడంతో వారి స్పిన్ దళం కాస్త బలహీనంగా కనపడుతున్నది. ఏదేమైనా.. చెన్నై మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
హెడ్ టూ హెడ్
మ్యాచ్‌లు 122
ఇండియా 26
ఇంగ్లాండ్ 47
డ్రా 49
టై 0
చివరి మూడు సిరీస్
2014 : ఇండియాను ఇంగ్లాండ్ 3-1తో ఓడించింది.
2016/17: ఇంగ్లాండ్‌ను ఇండియా 4-0తో ఓడించింది
2018 : ఇండియాను ఇంగ్లాండ్ 4-1తో ఓడించింది
తుది జట్టు అంచనా : శుభమన్ గిల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ