- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US నుంచి ఇండియాకు చేరిన ఆక్సిజన్ సిలిండర్లు
X
న్యూఢిల్లీ: కరోనాపై భారత్ పోరులో అమెరికా సహకరిస్తుందని బుధవారం హామీనిచ్చింది. కనీసం 10 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్‌కు అందిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా అమెరికా నుంచి వైద్య సామగ్రితో తొలి ఫ్లైట్ దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. 400కుపైగా ఆక్సిజన్ సిలిండర్లు, సుమారు పది లక్షల ర్యాపిడ్ కరోనా టెస్టు కిట్లు, హెల్త్ వర్కర్ల కోసం ఒక లక్ష ఎన్95 మాస్కులను యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-5ఎం సూపర్ గెలాక్సీ విమానం ఈ రోజు ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయింది. అమెరికా నుంచి తొలి సహకార షిప్‌మెంట్ భారత్‌కు చేరుకుందని యూఎస్ ఎంబస్సీ ట్వీట్ చేసింది. ఇరుదేశాలు 70ఏళ్ల సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నాయని వివరించింది. కరోనాపై పోరులో భారత్‌కు అమెరికా అండగా ఉంటుందని తెలిపింది.
Advertisement
Next Story