- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారతీయ తొలి సైన్స్ ఫిక్షన్.. ‘బాలయ్య’ సినిమాకు 30 ఏళ్లు
దిశ, సినిమా : నందమూరి బాలకృష్ణ హీరోగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన సినిమా ‘ఆదిత్య 369’. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన మొదటి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. శాస్త్రవేత్తలకు సైతం స్ఫూర్తిగా నిలిచి ప్రశంసలు అందుకున్న సినిమా విడుదలై నేటి(జూలై 18)కి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హీరో, దర్శక-నిర్మాతలు తమ అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు. కొన్నిటి గురించి ఎక్కువగా మాట్లాడితే సూర్యుడిని వేలెత్తి చూపించినట్టు అవుతుందన్న బాలయ్య.. ‘ఆదిత్య 369’ కూడా అటువంటి చిత్రమేనని అన్నారు. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన దర్శక, నిర్మాతలు, టెక్నీషియన్స్‌తో పాటు ఆదరించిన ప్రేక్షకదేవుళ్ళకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఫ్యూచర్‌లో ‘ఆదిత్య 369’కి సీక్వెల్స్ చేయాలని నిర్ణయించుకున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇక దర్శకులు సింగీతం మాట్లాడుతూ.. రిలవెన్స్, కాంటెంపరరీ రిలవెన్స్ అనే అంశాలే సినిమాకు ప్రత్యేకతను చేకూర్చాయన్నారు. అదెలా అంటే? ‘ఈ మధ్య మా మనవరాలి పెళ్లి అమెరికాలో జరిగింది. మేం ఇండియాలో ఉన్నాం. పెళ్లిని లైవ్‌లో చూశాం. వెంటనే నాకు చాలామంది ఫోన్‌చేసి ఒక విషయం గుర్తుచేశారు. సార్, మీరు ఆ రోజు ఆదిత్య 369లో టీవీలో పెళ్లి చూస్తారని చెప్పింది ఈ రోజున జరిగింది’ అని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన నేటికీ ఎంతో రిలవెన్స్ ఉన్న సినిమా ‘ఆదిత్య 369’ అని, ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా అవి ఆ రోజుల్లోనే బాగున్నాయి తప్ప ఈ రోజులకు అన్వయించుకునేవి కాదన్నారు.
కానీ ‘ఆదిత్య 369’ను మాత్రం ఇప్పటికీ అన్వయించుకోవచ్చని తెలిపారు. కాగా జూలై 19, 1991న రిలీజైన సినిమా వల్ల తనకు వచ్చిన గౌరవం 30 ఏళ్లే కాదు, 50 ఏళ్లైనా ఉంటుందన్న నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.. ఇది తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఇక ఈ సినిమా కార్యరూపం దాల్చేందుకు కృషి చేసిన లేట్ ఎస్పీ బాలు కొడుకు ఎస్పీ చరణ్ వాయిస్‌తో ‘ఆదిత్య 369’కు సంబంధించి స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేయడం విశేషం.