బ్యాట్‌మన్ డిటెక్టివ్ కామిక్ @ రూ. 11 కోట్ల 12 లక్షలు

by Shyam |
బ్యాట్‌మన్ డిటెక్టివ్ కామిక్ @ రూ. 11 కోట్ల 12 లక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: కామిక్ పుస్తక ప్రపంచంలోకి ఫిక్షనల్ క్యారెక్టర్ బ్యాట్‌మన్ వచ్చి ఇప్పటికే 80 సంవత్సరాలు దాటింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ క్యారెక్టర్ తెరమీద అలరిస్తూనే ఉంది. చిన్నపిల్లలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తూనే ఉంది. ఇటీవలే క్యాన్సర్‌‌ వ్యాధితో చివరి రోజులు లెక్కబెడుతున్న ఓ చిన్నారి కోరికను తీర్చేందుకు ఓ వైద్యుడు బ్యాట్‌‌మన్‌గా‌ కనిపించి ఆ బాలుడిని సంతోషపెట్టిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచానికి బ్యాట్‌మన్ క్యారెక్టర్ పరిచయం చేసిన తొలి నవల ‘డిటెక్టివ్ కామిక్స్’. తాజాగా ఆ పుస్తకం కాపీ ఒకటి బ్యాట్‌మన్ బుక్ సిరీస్‌లోనే అత్యధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం.

1939 నాటి ‘డిటెక్టివ్ కామిక్స్’ ‌పుస్తకాలు ప్రస్తుతం కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలోనూ సర్టిఫైడ్ గ్యారెంటీ కంపెనీ(సీజీసీ) 7.0(ఫైన్/వెరీ ఫైన్) గ్రేడ్‌ను కలిగి ఉన్న పుస్తకాలు రెండు మాత్రమే ఉన్నాయి. అందులోని ఓ కాపీనే అమెరికాలో హెరిటేజ్ ఆక్షన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘కామిక్స్ అండ్ కామిక్ ఆర్ట్ ఈవెంట్’లో అమ్మకానికి పెట్టారు. అనూహ్యంగా ఆ బుక్ రూ. 11,12,43,975/-కు అమ్ముడుపోయి, బ్యాట్‌మన్ కామిక్ పుస్తకాల్లోనే రికార్డు సృష్టించింది. ఇదే వేలంలో 1940లో ప్రచురితమైన మరో బ్యాట్‌మన్ పుస్తకం రూ. 46 లక్షలకు అమ్ముడుపోయింది.

సూపర్‌మ్యాన్ తొలిగా ఇంట్రడ్యూస్ అయిన ‘యాక్షన్ కామిక్స్ నెం.1’ అనే కామిక్ పుస్తకం 2014లో హెరిటేజ్ ఆక్షన్స్ ఆధ్వర్యంలో వేలంలో వేయగా.. 3.2 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి రికార్డ్ సృష్టించింది. ఆ రికార్డ్‌ను ప్రస్తుతం బ్యాట్‌మన్ పుస్తకం బ్రేక్ చేసిందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed