నాగార్జునసాగర్ ‘ఎర్త్ డ్యాం’పై మంటలు..

by Shyam |   ( Updated:2024-06-02 15:20:13.0  )
నాగార్జునసాగర్ ‘ఎర్త్ డ్యాం’పై మంటలు..
X

దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని లెఫ్ట్ ఎర్త్ డ్యాంపై మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది.. మున్సిపాలిటీ సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది వాటర్ ట్యాంకులతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎర్త్ డ్యామ్‌పై ఉన్న లైటింగ్‌కు అమర్చిన వైర్లు కాలిపోయాయి. ఇంకా ఎలాంటి నష్టం జరగలేదని ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed