- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుప్పంలో చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పు
దిశ, వెబ్‌డెస్క్ : చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఆయన ఫ్లెక్సీని దుండగులు దహనం చేశారు. ఈ ఘటనతో చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇటీవల కుప్పం వచ్చిన చంద్రబాబు నాయుడికి స్వాగతం తెలుపుతూ కుప్పం మండలం లక్ష్మీపురంలో టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటికి బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి దహనం చేశారు. మరోవైపు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహం సమీపంలో ఏర్పాటు చేసిన టీడీపీ బ్యానర్‌లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుండగులను శిక్షించాలని కుప్పం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కాగా చంద్రబాబు రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ గెలుపొందుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ఆయనకు ఎదురు గాలి వీచింది. ఆ నియోజకవర్గంలో అధిక మొత్తంలో వైసీపీ సీట్లు కొల్లగొట్టింది. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తాజాగా ఫ్లెక్సీల దహనంతో కుప్పం రాజకీయం వేడెక్కింది.