సాగర్ అడవుల్లో మంటలు.. 4గంటల్లో అదుపులోకి!

by Sumithra |   ( Updated:2021-03-04 11:20:03.0  )
సాగర్ అడవుల్లో మంటలు.. 4గంటల్లో అదుపులోకి!
X

దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జమ్మనకోట తండా శివారులోని అడవుల్లో సుమారు నాలుగు గంటల సమయంలో చెలరేగిన మంటల్ని అటవీశాఖ సిబ్బంది ఎట్టకేలకు అదుపులోకి తెచ్చారు. 4 సమయంలో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.

అది కాస్త దాదాపు 20 హెక్టార్ల మేర మంటలు విస్తరించాయి. సమాచారం అందుకున్న అటవీ, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. అటవీ విస్తీర్ణం అధికంగా ఉండటంతో మంటల్ని అదుపులోకి తేవడం సిబ్బందికి కష్టంగా మారింది. ఎట్టకేలకు మంటల్ని పూర్తిగా ఆర్పివేసినట్టు రేంజ్‌ అధికారి రామేశ్వర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed