రష్యా లో అగ్నిప్రమాదం

by vinod kumar |   ( Updated:2020-10-07 21:34:38.0  )
రష్యా లో అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యాలో ఆయుధాల డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. మాస్కోకు ఆగ్నేయంగా ఉన్న రియాజాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మందుగుండు సామగ్రి డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అధికారులు రియాజాన్ చుట్టుప్రక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమీప పొలంలోని మంటలు గాలి ప్రసారం వల్ల డిపోకు తగలడంతో మంటలు చెలరేగినట్లు రష్యా మిలటరీ సంస్థ టాస్ టీఏఎస్ఎస్ తెలిపింది.

Advertisement

Next Story