- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబ్బుగూడెంలో భారీ అగ్నిప్రమాదం.. 15 ఇళ్లు దగ్ధం
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. పోలీసుల వివరాల ప్రకారం అన్నపురెడ్డి మండలం అబ్బుగూడెం గ్రామంలో ప్లాస్టిక్ సంచులతో పరదాలు తయారు చేసే పరిశ్రమ ఉంది. మధ్యాహ్నం పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పక్కనే ఉన్న పూరి ఇళ్లకు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లలోని వారి వ్యవసాయ పనులకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ, 15 ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వస్తువులన్నీ అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. మరోవైపు పరిశ్రమలో మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. మరికొన్ని ఫైర్ ఇంజన్లను అబ్బుగూడానికి తరలించాలని అధికారులను కలెక్టర్ ఎంవీరెడ్డి ఆదేశించారు. పరిశ్రమలో ప్లాస్టిక్ సంచులు ఉండటంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది.
Tags: fire accident, khammam, abbugudem, plastic manufacturing company, people panic