నిన్నవరి..నేడు ఈత వనం

by Sumithra |
నిన్నవరి..నేడు ఈత వనం
X

దిశ,నిజామాబాద్ :
రాష్ట్రంలో రోహిణి కార్తే ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. భానుడు నివురు గప్పిన నిప్పులా భగభగ మండుతున్నాడు.ఇన్నిరోజులకు లాక్‌డౌన్ సడలించారని సంబురపడలా లేక ఎండ తీవ్రత పెరుగుతోందని బాధపడలా తెలియని స్థితిలో ప్రజలు ఉన్నారు.ఈ క్రమంలోనే భానుడి ప్రతాపానికి పొలాలు, తోటల్లో మంటలు చెలరేగుతున్నాయి. నిన్న వరిపొలాల్లో అగ్నికిలలు లావాల వ్యాపించి రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి.అయితే శుక్రవారం నిజామాబాద్ జిల్లా ముఫ్కాల్ మండలం కొత్త పల్లిలోని ఈత వనంలో నిప్పు రాజుకుంది.ఈ ఘటనలో సుమారు 1000 ఈత చెట్లకు మంటలు వ్యాపించగా కాలిబూడిదయ్యాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా అగ్నిమాపక యంత్రం సాయంతో మంటలు ఆర్పుతున్నారు.ఇదిలాఉండగా వేడి తీవ్రత వలనే పొలాలు, చెట్లకు మంటలు అంటుకుంటున్నాయా లేదా ఎవరైనా కావాలని చేస్తున్నారా అని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed