ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మెన్‌పై దేశద్రోహం

by vinod kumar |
ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మెన్‌పై దేశద్రోహం
X

న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఢిల్లీ మైనారిటీస్ కమిషన్ చైర్మెన్ జాఫరుల్ ఇస్లాం ఖాన్‌పై దేశద్రోహం అభియోగం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇండియాలో ముస్లిం వ్యతిరేకత పెరుగుతున్నదని, దాన్ని ఆపాలని అరబ్ దేశాల నుంచి సూచనలు వచ్చిన నేపథ్యంలో జాఫరుల్ ఇస్లాం ఖాన్ పలు కామెంట్లు చేశారు. భారత ముస్లింలకు అండగా నిలిచినందుకు కువైత్ దేశానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే గతనెల 28న ఫేస్‌బుక్‌లో కామెంట్ పోస్టు చేశారు. కొందరు మతోన్మాదులు తమ మతస్తులపై దాడికి పాల్పడినా.. మిన్నకుంటున్నారని, ఒకవేళ అరబ్ దేశాలకు తెలిపితే.. తుఫానే వస్తుందని ఆ పోస్టులో పేర్కొన్నారు. కరోనా వైరస్ దేశంలో ఎంటర్ అవుతుండగా.. తబ్లిగీ జమాత్ హాట్‌స్పాట్‌పై పలువురు నేతలు మతపరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Tags: coronavirus, delhi, minorities commission, chairman, sedition, fir, communal

Advertisement

Next Story

Most Viewed