- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై పోరు పీఎంవోకే పరిమితమైతే ఓడిపోతాం : రాహుల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఎత్తివేతపై కేంద్రం… తన వ్యూహాన్ని పారదర్శకంగా ఉంచాలని కాంగ్రెస్ ఎంపీ, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. అలాగే, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు తీసుకునే చర్యలనూ స్పష్టంగా వెల్లడించాలని చెప్పారు. అంతేకాదు, ఈ కరోనా మహమ్మారిపై పోరును కేవలం ప్రధాని కార్యాలయానికే పరిమితం చేస్తే మనం ఓడిపోతామని అభిప్రాయపడ్డారు. పలువురు మేధావులతో సంభాషణలు సాగిస్తున్న రాహుల్ గాంధీ శుక్రవారం విలేకరులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పార్టీ అంతర్గత కమిటీ అభిప్రాయాలను ఆయన విలేకరులతో వెల్లడిస్తూ కేంద్రానికి పలుసూచనలు చేశారు.
కరోనాపై పోరులో దేశానికి కేవలం బలమైన ప్రధాని ఉంటే సరిపోదని, బలమైన ముఖ్యమంత్రులూ ఉండాలని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ పోరాటాన్ని కేవలం పీఎంవో ద్వారానే సాగిస్తే మనం ఓడిపోతామని అన్నారు. ప్రధాని తప్పకుండా అధికారాలను పంచుకోవాలని సూచించారు. ‘ప్రధానికి ప్రత్యేకమైన శైలి ఉన్నది. కానీ, అది అన్ని విషయాల్లో సరిపడకపోవచ్చు. ఇటువంటి ఆపత్కాలాల్లో అది పనిచేయదు. మనకు కేవలం బలమైన ప్రధాని సరిపోడని, మనకు చాలా… చాలా మంది బలమైన నాయకులు కావాలి. బలమైన సీఎంలు, బలమైన జిల్లా మెజిస్ట్రేట్‌లు కావాలి. పంచాయతీ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్రా స్థాయిల వరకు దేశభక్తి కలిగిన బలమైన నాయకులు కావాలి. అందరం కలిసి ఈ సమస్య అంతుచూడాలి. అయితే, ఇది స్థానికంగా జరగాల్సిన పని.. జాతీయ స్థాయిలో కాదు. అందుకే కరోనా వైరస్‌పై పోరాటాన్ని ఒకే చోట కేంద్రీకృతం చేయరాద’ని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపకుండా.. రెడ్ జోన్‌లను కేంద్ర ప్రభుత్వమే గుర్తించిందని ముఖ్యమంత్రులు చెబుతున్నారని, వాస్తవానికి ఈ పని స్థానిక ప్రభుత్వాలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రెడ్ జోన్‌ల గుర్తింపుపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదించలేదని కాంగ్రెస్ అధికారంలోని రాష్ట్రాల సీఎంలు ఆరోపించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనా ప్రాణాంతకం కాదు.. దానిపై భయాలను తొలగించాలి
కరోనా వైరస్ ప్రాణాంతకం కాదని రాహుల్ అన్నారు. కేవలం ఒక్క శాతం జనాభాకే దీనితో ముప్పు ఉన్నదని తెలిపారు. ‘డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌లాంటి సమస్యలున్న వృద్ధులకే ఈ మహమ్మారితో ప్రమాదం. అంతేకాని, మిగతావారికి ఇది ప్రాణాంతకమేమీ కాదు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థం చేయించాలి. ఇప్పుడు ఈ వైరస్ అంటే భయపడిపోతున్నారు. కాబట్టి మానసికంగా వారిని సిద్ధం చేయాలి. ఆ భయాలనే ఆత్మస్థైర్యంగా మార్చాలి. అప్పుడే లాక్‌డౌన్ ఎత్తేయడం సులువవుతుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఎత్తేయాలంటే మాత్రం ఈ వైరస్ చుట్టూ పేరుకున్న భయాలను తప్పక తొలగించాలి’ అని వివరించారు.
పేదలకు రూ. 65వేల కోట్ల ధనాన్ని అందించాలి
ఈ కాన్ఫరెన్స్‌లో రాహుల్ గాంధీ వలస కార్మికులపై ప్రత్యేకంగా మాట్లాడారు. వారిపై ఒత్తిడిని కేంద్రమే బాధ్యతగా తీసుకుని తగ్గించాలని చెప్పారు. ‘వలస కార్మికులు తమ జీవితాలను నెట్టుకురావడానికి దారులన్ని మూసుకుపోతున్నాయి. ఇటువంటి సంక్షోభ సమయంలో ప్రభుత్వమే ఆర్థికంగా సహకరించాలని వివరించారు. ఇందుకోసం రాష్ట్రాలు పరస్పరం సామరస్యంగా చర్చించుకోవాలి. ఆ చర్యలను కేంద్రం పర్యవేక్షించాలని అన్నారు. ఈ కష్టకాలంలో పేదలు, వలస కార్మికులను ఆదుకునేందుకు తప్పకుండా వారికి ఆర్థిక సహకారాన్ని కేంద్రం అందించాలి. పేదలు, వలస కార్మికుల బ్యాంక్ ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం వెంటనే రూ. 65వేల కోట్ల మొత్తాన్ని పంపించాలి. వీటితోపాటు ఆర్థిక వ్యవస్థను మళ్లీ ప్రగతి మార్గంలో నడిపించేందుకు పేదలతోపాటు, పారిశ్రామిక రంగాన్నీ ఆదుకోవాలి. ఈ సహకారం వెంటనే జరిగిపోవాలి’ అని చెప్పారు.
tags: rahul gandhi, lockdown,migrant workers, centralisation, support