పురుగులమందు తాగి.. ఫారెస్ట్ ఆఫీసర్ ఆత్మహత్య

by Anukaran |   ( Updated:2020-08-12 08:03:29.0  )
పురుగులమందు తాగి.. ఫారెస్ట్ ఆఫీసర్ ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: క్షణికావేశంలో మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వహిదా బేగం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed