- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘కరోనాకు మందు నిజం కాదు.. కంపెనీల ఎత్తుగడే’
దిశ, న్యూస్ బ్యూరో: కరోనాకు ఔషధం వచ్చేసింది. ఇక మెడికల్ షాప్‌కు వెళ్లి కొనుక్కొని వేసుకోవడమే అని అనుకోవద్దు. ప్రపంచ వ్యాప్తంగా 54 దేశాల్లో ఫావిపిరవీర్, రెమ్‌డెసివీర్ ఔషధాలపై ప్రయోగాలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు, ఫార్మకాలజిస్టు డాక్టర్ ఆకుల సంజయ్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. ఫావిపిరవీర్, రెమ్‌డెసివీర్ వంటి ఔషదాలు వచ్చేసాయంటూ హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఔషదాల మీద చాలానే అనుమానాలు ఉన్నాయి. ఇంకా ప్రయోగాలు చేయాలంటున్నారు. అందుకే కరోనాకు మందు రావాలి అని నేను కూడా కోరుకుంటున్నా.. కానీ వచ్చేసింది అనే స్టేట్మెంట్ నిజం కాదని ప్రజలు గమనించాలి. ఇప్పటికే ఉన్న హైడ్రోక్లోరోక్విన్, రెమ్‌డెసివీర్, ఇంటర్ఫెరాన్ వాటి జాబితాలో ఇది మరో ఔషదమంతే. రోగం ఉండగానే సంపాదించాలని అని ఫార్మా కంపెనీలు ప్రయత్నిస్తున్నట్టుంది. అందుకే అతిగా ఆశ పెట్టుకోవద్దని సూచించారు.
ఇండియాలో పెద్ద ఫార్మా కంపెనీ గ్లెన్మార్క్ భారత్‌లో పూర్తి స్థాయి కరోనా చికిత్సకు ఫావిపిరవీర్ ఔషధాన్ని వినియోగించబోతున్నట్టు ప్రకటించింది. అయితే ఇదొక యాంటీవైరల్ డ్రగ్ మాత్రమే. జపాన్‌లో ఇన్ ఫ్లూయెంజా చికిత్స కోసం వినియోగించేవారు. హక్కులు ఫ్యూజీఫిల్మ్ కంపెనీవే. వైరస్‌లు తమ అభివృద్ధి కోసం వినియోగించే ఆర్ఎన్ఏ పాలీమెరెస్‌ను పని చేయకుండా చేస్తుంది. దాని ద్వారా వైరస్ సంఖ్య పెరగకుండా చేస్తుంది. భారత్‌లో కేవలం 150 మంది వ్యాధిగ్రస్తులకు ఈ ఔషధాన్ని ఇచ్చినపుడు చాలా మంది వారం రోజుల్లో కోలుకున్నారు. వేరే ఔషధాలు వాడిన వారు కూడా రెండు వారాల్లో కోలుకున్నారు. అసలు మొత్తం ప్రయోగ వివరాలు వెల్లడించలేదు. అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు మాత్రమే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించింది. దీనిని ఫ్యాబిఫ్యూ పేరుతో ఇండియాలో విక్రయిస్తారు. దీని డోసేజ్ 34 టాబ్లెట్స్, ధర రూ.3,500. మొత్తం డోస్ రూ.14 వేలని కథనాలు వినిపిస్తున్నాయి. డాక్టర్ల పర్యవేక్షణ లో మాత్రమే వినియోగించాలి. రష్యాలో ఈ ఔషధాన్ని 390 మంది వ్యాధిగ్రస్తులలో వినియోగించినప్పుడు 68 శాతం మందిలో 3 రోజుల్లో లక్షణాలు తగ్గాయి. వేరే ఔషధాలు వాడిన వారిలో 6 రోజులు పట్టింది. జపాన్‌లో ఈ ఔషధాన్ని 2,141 మందిపై ప్రయోగిస్తే రెండు వారాల్లో 88 శాతం కోలుకున్నారు. త్వరలో ఈ ఔషధాన్నియూమిఫినోవిర్ అనే మరో ఔషధంతో కలిపి పరిశోధించబోతున్నారు. కిడ్నీ, లివర్ వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, బాలింతలు ఈ ఔషధం వినియోగించొద్దు. ఐతే పుట్టిల్లు జపాన్లో అవిగాన్ పేరుతో ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, అక్కడి ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వలేదు. ఇప్పటికే అనుమతులను రెండు సార్లు వాయిదా వేసింది. డాక్టర్స్ చీటితో మెడికల్ షాపులో అమ్ముతారు. కానీ ముందుగా పేషెంట్ అంగీకార పత్రం ఇవ్వాలి. ఔషధం మానవ రోగ నిరోధక వ్యవస్థని సర్ప్రెస్ చేయడం వల్ల ఇతర సూక్ష్మజీవులు వ్యాధిని కలిగించవచ్చు. ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకే కరోనా వైరస్ పట్ల ఇంకా జాగ్రత్త వహించాల్సిందేనని సంజయ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.