- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
షాక్‌లో హీరోయిన్.. చెంప పగలగొట్టిన అపరిచితుడు
by Shyam |

X
దిశ, సినిమా : ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్.. తన తండ్రి, ఫ్యామిలీ ఎంత బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమో ఓ ఇంటర్వ్యూలో వివరించింది. ఎలాంటి సమయంలోనైనా తనకు ప్రొటెక్షన్‌గా ఉంటారని ఓ ఇన్సిడెంట్ గురించి వెల్లడించింది. జిమ్‌కు వెళ్లి వస్తున్న క్రమంలో ఓ వ్యక్తి తననే చూస్తున్నాడని, ఎందుకలా చూస్తున్నావ్? అని అడిగితే.. నా ఇష్టం అంటూ పొగరుగా సమాధానమిచ్చాడని చెప్పింది. తనకు, ఆ వ్యక్తికి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగిందని, ఈ క్రమంలో తను నా ఫేస్‌ను టచ్ చేయగా కోపంతో చెంప మీద ఒక్కటిచ్చానని.. వెంటనే అతను కూడా తనను కొట్టేశాడని తెలిపింది. దీంతో తండ్రిని పిలిచానని.. తను, బ్రదర్, ఫ్రెండ్స్ కలిసి అతన్ని పట్టుకునేందుకు వీధులన్నీ గాలించారని చెప్పుకొచ్చింది ఫాతిమా. తన కూతురిని ఎలా టచ్ చేస్తావంటూ నాన్న కోపంతో ఊగిపోయాడని వివరించింది.
Next Story