‘స్మార్ట్’ ట్రాప్ : వరంగల్ టు తిరుపతి ఓ బాలిక జర్నీ.. తీరా చూస్తే షాక్..!

by Sumithra |   ( Updated:2021-07-21 09:59:00.0  )
smart phone
X

దిశ, పర్వతగిరి : పచ్చని కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్స్ కొత్త చిచ్చులు పెడుతున్నాయి. వాటికి బానిస అవుతున్న నేటి యువత తీసుకునే నిర్ణయాలు తల్లిదండ్రులను సమాజంలో తల ఎత్తుకోకుండా చేస్తున్నాయి. తాజాగా ఓ బాలిక చేసిన పని ఆ ఇంటి పెద్ద మరణానికి కారణం అవ్వడమే కాకుండా, ఆమె జీవితాన్ని పెనుప్రమాంలో పడవేసింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామంలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. చౌటపల్లికి చెందిన మైనర్ బాలిక స్మార్ట్ ఫోన్‌కు అలవాటు పడి ఫేస్‌బుక్‌లో అనుక్షణం గడుపుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఏపీలోని తిరుపతికి చెందిన రాజశేఖర్(28) యువకునితో కొన్నాళ్లుగా చాటింగ్ చేసి చివరగా అతని ట్రాప్‌లో చిక్కుకుంది. దీంతో తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు కనిపించకపోవడంతో ఆమె తండ్రి పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తుండగానే కూతురు విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు బాలిక తనతో పాటు మొబైల్ తీసుకు వెళ్లలేదు. దీంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే, లేటెస్ట్ టెక్నాలజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేసిన పోలీసులు తిరుపతికి చెందిన పైడి రాజశేఖర్ అనే యువకునితో ఫేస్‌బుక్‌లో బాలిక ప్రేమ వ్యవహారం నడిపినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను చెప్పడంతోనే ఇంట్లో చెప్పకుండా తిరుపతికి వెళ్లిందని గుర్తించారు.

పూర్తి సమాచారంతో రంగంలోకి దిగిన సీఐ విశ్వేశ్వర్, ఎస్సై నవీన్ కుమార్ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి ఎట్టకేలకు బాలిక ఆచూకీ కనిపెట్టారు. రాజశేఖర్ వద్ద ఉన్న మైనర్ బాలికను చైల్డ్ హోమ్‌కు తరలించారు. ఇక ప్రేమ పేరుతో బాలికను ట్రాప్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక స్మార్ట్‌ఫోన్ వినియోగం వల్ల పిల్లలు బలవుతున్నారని, ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో మొబైల్స్ విపరీతంగా వాడకం కలకలం రేపుతోందని పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్ వివరించారు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్న తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని ఏసీపీ నరేష్ కుమార్ సూచించారు. ఈ కేసును ఛేదించిన సీఐ విశ్వేశ్వర్, ఎస్సై నవీన్ కుమార్, పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Crime News: ఆరునెలలుగా కూతురిపై తండ్రి అత్యాచారం.. సపోర్ట్ చేసిన తల్లి..?

నటి కవిత శ్రీ అరెస్టు.. ఆమెలో ఈ యాంగిల్ కూడా ఉందా..?

Advertisement

Next Story

Most Viewed