కోడి కోసం కొడుకు హత్య

by srinivas |

దిశ, వెబ్‌డెస్క్: కోడి కోసం కన్న కొడుకును కడతేర్చిన దారుణ ఘటన.. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్దేశ్వరరావు అనే యువకుడు ఓ కోడిని పెంచుకుంటున్నాడు. అయితే, తన తండ్రి కాంతారావు చెరువులో ముంచి దాని ప్రాణం తీసి.. గుట్టుగా ఉంచాడు. కోడి కనిపించడం లేదని మద్దేశ్వరరావు తండ్రిని అడగడంతో చనిపోయిందని బదులిచ్చాడు. దీంతో కాంతారావుతో ఆయన వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆవేశానికి గురైన తండ్రి.. కత్తితో చాతిలో పొడవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్తున్న మార్గమధ్యలోనే మద్దేశ్వరరావు మృతిచెందాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read also..

ఇరాన్-టర్కీ సరిహద్దుల్లో భూకంపం

Advertisement

Next Story

Most Viewed