- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రినే కడతేర్చిన కసాయి కొడుకు
దిశ, ఖమ్మం రూరల్: కొడుకు చేతిలో తండ్రి హతమైన సంఘటన రూరల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎం.వీపాలెం గ్రామంలో కొలిచలం రామచంద్రయ్య(70)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్ధరికి పెళ్లి కూడ జరిగింది. గత నాలుగు సంవత్సరాల క్రితం చిన్న కుమారుడు ఉమాశంకర్‌కు వివాహం జరిగింది. కుటుంబ కలహల వలన భార్య పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి శంకర్ తన తండ్రిని తరుచుగా భార్యను తీసుకురావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. తన భార్యను తీసుకరాకపోతే చంపుతానని బెదిరించేవాడు.
ఈ విషయంలో పలుమార్లు పెద్దమనుషులు పంచాయతీ నిర్వహించి శంకర్‌ను మందలించారు. దీనిని మనస్సులో పెట్టుకున్న కుమారుడు బుధవారం తెల్లవారుజామున ఇంట్లో మంచంమీద పడుకున్న తండ్రి రామచంద్రయ్యను తలకు నేలకేసి కొట్టడంతో పాటు ఉరితీశాడు. గమనించిన తల్లి లక్ష్మిదేవమ్మ కేకలు వేసి చూట్టుపక్కలవారిని పిలిచేసరికే శంకర్ పారిపోయాడు. రామచంద్రయ్య తలకు బలమైన గాయాలవడంతో అప్పటికే చనిపోయి ఉన్నాడు. వెంటనే హస్పిటల్‌కు తరలించగా వైద్యులు చనిపోయినట్లు ధ్రవీకరించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ రవూఫ్ సంఘటన స్థలానికి చెరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.