‘కరోనా సాయం’ కోసం కన్న తండ్రి హత్య

by Aamani |

దిశ, ఆదిలాబాద్: ప్రభుత్వం ఇస్తున్న కరోనా సాయం రూ. 1500 కోసం తండ్రిని కొడుకు హత్య చేసిన సంఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు రూ. 1500 ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రెండో దఫా నగదు కూడా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఆ డబ్బులు బ్యాంకు నుంచి తీసుకొచ్చి తనకు ఇవ్వాలని తండ్రి చిక్కాల శ్రీనివాస్ (45)తో కొడుకు సంతోష్ కొద్ది రోజులుగా గొడవ పడుతున్నాడు. ఇందుకు తండ్రి నిరాకరించాడు. మంగళవారం కూడా తండ్రిని డబ్బుల కోసం వేధించగా ససేమిరా అన్నాడు. దీంతో ఆవేశానికి లోనైన సంతోష్ దుడ్డుకర్రతో తండ్రి శ్రీనివాస్ తలపై కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ని గ్రామస్తులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో శ్రీనివాస్ మృతిచెందారు. చిక్కాల సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రమోద్‌రెడ్డి తెలిపారు.

Tags: rs 1500, son killing his father, manchiryal dist

Advertisement

Next Story

Most Viewed