సొంత కూతురికి డెలివరీ చేసిన తండ్రి.. జనగామలో ఘటన

by Shyam |
సొంత కూతురికి డెలివరీ చేసిన తండ్రి.. జనగామలో ఘటన
X

దిశ, జనగామ: జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పగిడిపాటి‌ సుగుణాకర్ రాజు తన కూతురు తేజశ్రీకి సోమవారం జనగామ మతా శిశు ఆరోగ్య కేంద్రంలో డెలివరీ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన వృత్తి ధర్మాన్ని కొనసాగించారు. సొంత ఆసుపత్రి ఉన్నప్పటికీ మాతా ‌శిశు ఆసుపత్రిలో ‌తానే స్వయంగా ఆపరేషన్ చేయగా.. ఆడ పాప 3.5 కిలోల బరువుతో జన్మించింది. తల్లి‌ పిల్లలు‌ ఇరువురు క్షేమంగా ఉన్నారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చినప్పటికీ తన కూతురును అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళితే అక్కడి డాక్టర్లు‌ నిర్లక్ష్యంగా సమాధానము ఇవ్వడంతో.. డాక్టర్ ‌సుగుణాకర్ రాజు జనగామలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రత్యేకమైన వసతులు, డాక్టర్ల సేవలను వినియోగించుకున్నారు. ఈ సమయంలో జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడికి పలువురు అభినందనలు, హర్షం ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed