కూతురి ప్రేమ..తండ్రి ప్రాణం తీసింది

by Anukaran |   ( Updated:2020-07-10 07:59:29.0  )
కూతురి ప్రేమ..తండ్రి ప్రాణం తీసింది
X

దిశ, వెబ్‌డెస్క్: కూతురి ప్రేమ వ్యవహారం చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పోషించిన తండ్రి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన ప్రభాకర్‌ కూతురు హేమలత వేరే కులం అబ్బాయిని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు తేల్చిచెప్పింది. అందుకు తండ్రి ఒప్పుకోలేదు. దీంతో కూతురు హేమలత స్థానిక పోలీస్‌స్టేషన్ వెళ్లి తన తండ్రి ప్రేమ వివాహానికి అంగీకరించక పోగా, అడ్డుపడుతున్నాడని ఫిర్యాదు చేసింది. తనకు, ప్రియుడికి రక్షణ కల్పించాలని.. తండ్రి ప్రభాకర్ నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ప్రభాకర్‌ను పోలీసు‌స్టేషన్‌కు పిలిపించి కూతురు ఎదుటే చితకబాదారు. దీంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే, తన భర్త మృతికి పోలీసులే కారణమని భార్య ఆరోపించింది. కాగా, తండ్రిని కడసారి చూపుకు కూతురు హేమలత రాలేదని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed