- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వ్యాక్సిన్ రెడీ వేర్’పై మండిపడుతున్న నెటిజన్లు
దిశ, ఫీచర్స్ : కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తూ ఉండగా.. వైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతూనే ఉంది. ఏదేమైనా గానీ ట్రెండ్‌ను క్యాచ్ చేయడంలో మాత్రం క్లాతింగ్ బ్రాండ్స్ ముందుంటాయి. ఫస్ట్ ఫేజ్ కొవిడ్ సమయంలో పలు క్లాతింగ్ బ్రాండ్స్.. మ్యాచింగ్, డిజైనర్, ట్రికినీ, వెడ్డింగ్ వేర్ వంటి పలు రకాల మాస్క్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వ్యాక్సినేషన్ కొనసాగుతుండటంతో.. ఇప్పుడు ఇదే తరహా డ్రెస్‌లు(వ్యాక్సిన్ రెడీవేర్) రూపొందించి విమర్శల పాలవుతున్నాయి. ఇంతకీ దుస్తుల కంపెనీలు తీసుకొచ్చిన ఆ క్లాతింగ్ లైన్ విశేషాలేంటో తెలుసుకుందాం.
కరోనా టీకా వేయించుకున్నా, లేకపోయినా.. భుజానికి వ్యాక్సిన్ ఇస్తారన్న విషయం అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోయినా.. సెలబ్రిటీలు, వ్యాపార రాజకీయవేత్తలు తమ తమ సోషల్ మీడియాల్లో ‘ఐ యామ్ వ్యాక్సినేటెడ్’ అంటూ పెట్టిన ఫొటోలు చూసినా అర్థమైపోతుంది. ఇక వ్యాక్సిన్ వేసుకోవడానికి ముక్కుకు మాస్క్ పెట్టుకుని, డైలీ ధరించే దుస్తులు వేసుకుని వెళ్తే సరిపోతుంది. కానీ క్లాతింగ్ బ్రాండ్స్ దీన్ని కూడా తమ మార్కెటింగ్‌కు ఉపయోగించుకుంటున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈజీగా జరగాలంటే.. భుజాలు బయటకు కనిపించేలా డ్రెస్ ధరించి వెళ్లాలని ఫ్యాషన్ కంపెనీలు సూచిస్తున్నాయి. అంతేకాదు ఇందుకోసం స్పెషల్ డ్రెస్సింగ్ వేర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చి, వాటికి ‘వ్యాక్సిన్ రెడీ గార్మెంట్స్’ అని నామకరణం కూడా చేసేశాయి. కష్టకాలంలో కస్టమర్లు గార్మెంట్‌కు రాకపోవడంతో ఫ్యాషన్ బ్రాండ్స్ ఇలాంటి కుచ్చుటోపీ యవ్వరాలకు సిద్ధమైపోయాయి. కరోనా కాలంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ఇలాంటి ఆసక్తికరమైన మార్గాలతో ముందుకు వస్తున్నారు.
‘రివాల్వ్’ ఈ జాబితాలో ముందుండగా, తమ ‘వ్యాక్సిన్ రెడీ’ వేర్‌లో.. ఆఫ్-షోల్డర్ టాప్స్, ట్యాంక్ టాప్స్, స్లీవ్‌లెస్ డ్రెస్సులు మొదలైనవి ఉంటాయి. ఇక పురుషులకైతే స్లీవ్స్ ప్లేస్‌లో వ్యాక్సిన్ వేయడానికి అనువుగా ఉండేలా అక్కడ చిన్న రంధ్రాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు రివాల్వ్ తీసుకొచ్చిన ఈ ట్రెండ్‌ను పలు కంపెనీలు ఫాలో అవుతుండగా.. నెటిజన్లు మాత్రం క్లాతింగ్ కంపెనీలను ఉతికి ఆరేస్తున్నారు. ‘టీకా వేసుకోవడానికి కూడా కొత్త డ్రెస్ కొనుక్కావాలా, కక్కుర్తి కంపెనీలు కరోనాను కూడా వాడేసుకుంటున్నాయి. ఇది అన్యాయం, వ్యాక్సినేషన్‌కు కూడా స్టైల్‌గా వెళ్లాలా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.